తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజపుత్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందినటు వంటి ఆర్ ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ కూడా తన అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఓలక బోయడంతో ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. అలాగే ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత పాయల్ కు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ అవకాశాలు లభించాయి. అందులో భాగంగా అనేక సినిమా లలో నటించిన ఈ ముద్దు గుమ్మ కు ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత అంతటి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు దక్కలేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ మరో సారి ఆర్ ఎక్స్ 100 మూవీ దర్శకుడు అయినటు వంటి అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మంగళవారం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం పాయల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ... ఆ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. మరి మరో సారి ఈ దర్శకుడు పాయల్ కు అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందిస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: