స్టార్ హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలకు హైప్ రావాలంటే.. బజ్ క్రియేట్ అవ్వాలంటే యాంకర్ గా సుమ వ్యవహరించాల్సిందే.

సుమ కాకుండా మరెవ్వరైన యాంకరింగ్ చేస్తే కచ్చితంగా ఆ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం అసాధ్యం. ఇక చిన్న హీరోల సినిమాలకు స్టార్ హీరోలు గెస్ట్ గా వస్తే ఏ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుందో..అదే స్థాయిలో ఆ చిన్న హీరోల సినిమాల ఈవెంట్స్ కి యాంకర్ గా సుమ వ్యవహరిస్తే అదే స్థాయి బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. యాంకర్ గా సుమ మంచి ఫామ్ లో ఉంది. గడచిన పుష్కర కాలంగా ఆమె టైం నడుస్తోంది. ఆమె డేట్స్ కి అనుకూలంగా స్టార్ హీరోలు సైతం తమ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో ఆమె క్రేజ్ సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

చిన్న హీరోల సినిమాలు సుమ ని యాంకర్ గా తీసుకు వచ్చేంత బడ్జెట్ పెట్టలేవు అయినా కూడా ఏదో ఒక విధంగా సుమను తమ సినిమాలో భాగస్వామ్యం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతటి డిమాండ్ ఉన్న సుమ తన రెమ్యూనరేషన్ పెంచే విషయంలో ఎప్పటికప్పుడు ముందు ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు లక్ష రూపాయలకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సుమ ఇప్పుడు తన పారితోషికంను భారీగా పెంచేసిందట.

ఈ మధ్య కూడా సుమ మరోసారి తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. టీవీ షోస్ తో పోలిస్తే ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుందట. కాస్త రిస్క్ ఎక్కువ పైగా లైవ్ కనుక సుమ అంతటి పారితోషికం డిమాండ్ చేయడంలో తప్పేం లేదు అంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెర పై సుమ జోరు ఏమాత్రం తగ్గలేదు.. దాదాపు ఆమె రెండు దశాబ్దాలుగా సందడి చేస్తూనే ఉంది. కొడుకు హీరోగా పరిచయం కాబోతున్న కూడా యాంకర్ గా మాత్రం ఆమె సందడి తగ్గడం లేదు. మరో పదేళ్లు ఆమె యాంకర్ గా కొనసాగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: