తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియదర్శి ఆ తర్వాత అనేక మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు బలగం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ప్రియదర్శి సరసన కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ నటించగా ... కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా  కొన్ని రోజుల క్రితం నుండే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమాకు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన బలగం సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ సినిమా వచ్చే ఆదివారం స్టార్ మా చానల్లో సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానుంది. ఈ విషయాన్ని స్టార్ మా సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: