టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ రోజున త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈమే 40 వ ఎట ఈ పుట్టినరోజును జరుపుకోబోతోంది . 2002లో మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది త్రిష . ఆ తరువాత నీ మనసు నాకు తెలుసు అని చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది త్రిష. కానీ ఈమె కెరియర్ను మాత్రం మలుపు తిప్పిన చిత్రం వర్షం అని చెప్పవచ్చు ఈమె కెరియర్ లోనే మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డు ఈ చిత్రానికి అందుకుంది.


త్రిష కెరియర్ లో ఇప్పటివరకు 70 కు పైగా చిత్రాలలో నటించింది. త్రిష ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పైన కావస్తోంది ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగడం అంటే అది ఆశ మాస విషయం కాదు.. త్రిష ఇండస్ట్రీలో ఇప్పటికీ పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది .ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ్ తెలుగు వంటి భాషలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.


ఒకానొక సమయంలో త్రిష పని అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపించాయి 2017 వ సంవత్సరంలో అసలు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో ఈమె కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకొని  సెటిల్ అవ్వాలని అనుకుంది. అయితే కొన్ని కారణాల చేత ఆ వివాహం ఆగిపోవడంతో మళ్లీ 96 చిత్రంలో ఒక్కసారిగా ఈమె నటించి అద్భుతమైన నటన ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఇక అప్పటినుంచి తన సెకండ్ ఇన్నింగ్స్ లో విజయ దిశగా అడుగులు వేస్తోంది ఈ మధ్యగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD