తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో హీరో గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ... సమంత హీరోయిన్ గా శివ నార్వాన దర్శకత్వంలో రూపొందుతున్న "ఖుషి" అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది.

ఖుషి మూవీ లోని మొదటి సాంగ్ ను మే 9 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: