డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన ఫిధా సినిమా తో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ముఖ్యంగా ఈమె నటన డాన్స్ వేసుకుని దుస్తులు అన్నీ కూడా అచ్చ తెలుగు అమ్మాయిల ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది. సినిమాల ఎంపిక విషయంలో చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటుందని చెప్పవచ్చు.


సినిమాలో ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి స్టార్ హీరో సినిమానైనా సరే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈమె చేసింది తక్కువ సినిమాలైన భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఈమెకు తెలుగు ప్రేక్షకులు లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు. టాలీవుడ్లో చివరిసారిగా ఈమె విరాటపర్వం సినిమాలో నటించింది ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తమిళంలో హీరో సూర్య భార్య జ్యోతిక నిర్మించిన గార్గి చిత్రంలో కూడా నటించింది.


ఈ సినిమాని తెలుగులోకి కూడా గార్గి చిత్రంలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు కేవలం ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన గార్గి సినిమాలో గారికి అంటే ఎవరు ఈ సినిమాకు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం అందరిలోనూ తలెత్తుతోంది. ఈ పేరుకు గల అర్థం ఏమిటంటే పురాణాలలో మహర్షి వంశీయులలో వాచక్ను అనే మహర్షి కుమార్తె పేరే గార్గి నట్టా. ఆమెకు గార్గి వాచక్నవీ అని పిలుస్తూ ఉంటారట. ఈమె మహిళలకు పురాణం పట్టణం వేద పఠనం వంటి నిషిద్ధమైన రోజులలో కూడా ఉపనిషత్తులను అవపోషణ పట్టేదట. అందుచేతనే ఈమెను సహజసత్వవేత్తగా గౌరవిస్తారు అంట. అలా తన జీవితంలో ఓడిపోతూ గెలుస్తూ న్యాయం వైపు నిలబడే పాత్రని ఈ గార్గి అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: