మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమన్నా కొంత కాలం క్రితం సత్య దేవ్ హీరో గా రూపొందినటు వంటి గుర్తుందా శీతాకాలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా ... మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా ... సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటో లలో తమన్నా మరియు మెహర్ రమేష్ లు ఉన్నారు. ఈ ఫోటోలలో తమన్నా బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని స్టైలిష్ లుక్ లో ఉంది. అలాగే మరో ఫోటోలో తమన్నా కారు నడుపుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే భోళా శంకర్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తో పాటు తమన్నా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందుతున్న జైలర్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: