కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ ఆఖరుగా జాతి రత్నాలు మూవీ దర్శకుడు అయినటు వంటి అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. తర్వాత ఈ నటుడు మా వీరన్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తమిళం లో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు లో మహా వీరుడు పేరుతో విడుదల చేనున్నారు. 

ఈ సినిమాకు మడోనే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మార్చింది.

ముందుగా చెప్పిన తేదీ కంటే దాదాపు ఒక నెల ముందుగానే ఈ మూవీ ని ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను జూలై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: