పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో దాదాపు సమానంగా పవన్ "భీమ్లా నాయక్" సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ... సినిమా విడుదల అయ్యి కూడా సంవత్సరం దాటి పోతుంది. అయినప్పటికీ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. ఈ మూవీ షూటింగ్ ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మూవీ క్లైమాక్స్ సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్న సమయం లోనే పవన్ ఇప్పటికే తమిళ రీమిక్ వినోదయ సీతం సినిమాలో తన బాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ... సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవీ ల షూటింగ్ లను కూడా ప్రారంభించాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ లకు సంబంధించిన ఒక్కో షెడ్యూల్ షూటింగ్ ను కూడా పవన్ పూర్తి చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం "ఓజి" మూవీ కి సంబంధించిన రెండవ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత పవన్ "హరిహర వీరమల్లు" మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నిది అగర్వాల్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: