హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఆలియా తన అందంతో మాత్రమే కాకుండా తన అభినయంతో తన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందినటువంటి భారీ బడ్జెట్ తెలుగు సినిమా "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో ఆలియా ... రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమా లతో పాటు బిజినెస్ రంగం లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఆలియా మరి కొన్ని రోజుల్లోనే క్లాతింగ్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు ... అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ 15 కోట్ల డబ్బులు ఈ బిజినెస్ కోసం ఉపయోగించ బోతున్నట్లు ఒక వార్త ఫైనల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆలియా కొంత కాలం క్రితం రన్బీర్ కపూర్ హీరో గా రూపొందినటు వంటి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆలియా గంగుబాయి కటియావాడి మూవీతో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆలియా ప్రధాన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: