ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందినటు వంటి ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ విడుదల కాక ముందే ఈ సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్ లోనే ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా విడుదల కాక ముందే కృతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ ఆఫర్ లు వచ్చాయి. 

అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాల్లో నటించిన కృతి అందులో కొన్ని విజయాలను కొన్ని అపజయాలను అందుకుంది. తాజాగా కృతి "కస్టడీ" మూవీ లో హీరోయిన్ గా నటించింది. నాగ చైతన్యమూవీ లో హీరో గా నటించగా వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రేపు అనగా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. 

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: