తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తో ఈ నటుడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ మూవీ లో హీరో గా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

అలా కెరీర్ ను ప్రారంభించిన మొదటి రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక సినిమాలలో నటించినప్పటికీ ఏ మూవీ కూడా ఈ యువ హీరో కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించ లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఆది సాయి కుమార్ హిట్ ... ఫ్లాప్ లతో  ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. కానీ ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించ లేదు. అందులో భాగంగా తాజాగా ఆది సాయి కుమార్ "సీఎస్ఐ శంతన్" అనే మూవీ లో హీరో గా నటించాడు. శివ శేఖర్ దేవి దర్శకత్వం వహించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సడన్ గ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sai