దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన జోష్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జోష్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న చైతూ ఆ తర్వాత ఏం మాయ చేసావే మూవీ తో కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఎన్నో సినిమా లలో హీరో గా నటించిన చైతూ ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే చైతూ నటించిన సినిమా లలో కొన్ని సినిమాలు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా ... కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను కూడా అందుకున్నాయి. అలా చైతూ నటించిన ఫ్లాప్ మూవీ లలో థాంక్యూ మూవీ ఒకటి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా
.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.


సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తాజాగా ఛతూ ఈ మూవీ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడుతూ ... కొన్ని సినిమాలు ఎడిట్ టేబుల్ మీదే ఆడవు అని అర్థం అవుతాయి. అలా నాకు ఎడిట్ టేబుల్ మీద ఈ సినిమా ఆడదు అని అర్థం అయినా మూవీ థాంక్యూ. ఎలాగో మూవీ తీశాను కదా ... ప్రొడ్యూసర్స్ నష్ట పోకూడదు అని కష్టంగా ప్రమోట్ చేస్తాం అని చైతూ తాజాగా థాంక్యూ మూవీ గురించి స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: