టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్  కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సిత్తం రీమేక్. తమిళ దర్శకుడు ఇంకా నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది.తమిళనాడులో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనిరీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర సగ భాగం మాత్రమే ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ కి సంబంధించిన టాకీ పార్ట్ ని ముందుగా పూర్తి చేసేశారు.ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఇంకా ఇతర సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం #PKSDT వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో BRO అనే టైటిల్ అయితే చాలా గట్టిగా వినిపించింది.


తాజాగా చిత్ర యూనిట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఫ్యాన్స్ అందరూ అనుకున్నట్టే చివరికి BRO అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కి ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగానే ఉంది.అయితే పోస్టర్ లోని పవన్ కళ్యాణ్ లుక్ అయితే అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చింది. దీంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ అనేది పెరిగింది. కాగా సముద్రఖని గతంలో తెలుగులో మూడు సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్టు అందుకోలేకపోయిన కథ పరంగా మాత్రం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో సముద్రఖని  ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటాడా చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జులై 28 వ తేదీన రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో కేతిక శర్మ ఇంకా ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRO