తెలుగు సినీ ప్రేమికులకు ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈ నటుడు కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత లవ్లీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రెండు మూవీ ల తోనే బాగా పెరిగి పోయింది. 

అలా నటించిన రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆది ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి కూడా ఈ నటుడి మొదటి రెండు మూవీ ల రేంజ్ లో విజయాలను అందుకోలేదు. అయినప్పటికీ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఆది వరుస సినిమాల్లో నటిస్తూనే వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు టాప్ గేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోవడంతో ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: