ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కొన్ని అనుకోని పరిస్థితుల కారణం గా రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

ఇప్పుడు రెండవ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతుంది, #RRR చిత్రం విడుదలై ఏడాది గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కావడం తో ఫ్యాన్స్ సంతోషం గా ఉన్నారు. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 4 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా గురించి పక్కన పెడితే ఫ్యాన్స్ మొత్తం ‘దేవర’ చిత్రం కంటే కూడా త్వరలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్న సినిమా గురించే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇండియా లో రాజమౌళి తర్వాత అదే రేంజ్ స్టార్ స్టేటస్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే.

ఆయన టేకింగ్ అంటే మాస్ మూవీ లవర్స్ కి ఒక కనులపండుగ లాగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్ , ఈ చిత్రం పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రారంభించబోతున్నట్టు రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియచేస్తూ విడుదల చేసిన ఒక పోస్టర్ లో చెప్పారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని అయినా చెప్పిన సమయానికి ప్రారంభిస్తారా, లేదా సాగదీస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే కొరటాల శివ తో వాళ్లకి ఎదురైనా అనుభవం అలాంటిది.

#RRR తర్వాత ఎన్టీఆర్ కొత్త మూవీ కి సంబంధించి అప్డేట్ వినేందుకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు.ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రీ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం లో ఎవరెవరు నటించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ని కలిశాడట ప్రశాంత్ నీల్, ఆయన ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడా లేదా అనేది ఇంకా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: