యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు అయితే ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేరళకు చెందిన ఆమె అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారటా

నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈమె 'కల్యాణ ప్రాప్తిరస్తు', 'పవిత్ర ప్రేమ', 'వర్షం', వంటి సినిమాల్లో కూడా నటించింది.కానీ ఈమెకు వెండితెర అంతగా అయితే కలిసి రాలేదు.. కానీ బుల్లితెర పై మాత్రం బాగా క్లిక్ అయ్యిందని చెప్పవచ్చు.. ఎంతమంది యాంకర్లు వచ్చినా కూడా సుమను మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేకపోయారని తెలుస్తుంది.

ఈ విషయాన్ని అందరు యాంకర్లు కూడా ఒప్పుకుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తుందటా సుమ. సినిమా వేడుకలకు కూడా ఈమె యాంకరింగ్ చేస్తేనే ఎంతో అందం గా ఉంటుంది అని .సుమ యాంకర్ గా వ్యవహరించింది అంటే ఆ సినిమా పై కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది అనే నమ్మకం కూడా దర్శకనిర్మాతల్లో ఉంది. ఇదిలా ఉండగా.. సుమ పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్స్ అయితే జరుగుతుంటాయి.

తన భర్త రాజీవ్ తో సుమకు గొడవలు ఉన్నాయని అందువల్ల సెపరేట్ గా ఉంటుందని, ఇద్దరూ విడాకులు తీసుకుంటారని గతంలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇందులో నిజం లేదు అని ఆమె కొట్టిపడేసింది. సమయం దొరికినప్పుడల్లా.. తన భర్తతో కనిపిస్తూ అలాంటి ప్రచారాలు జరగకుండా అయితే చూసుకుంటుంది. ఇదిలా ఉంటే… తాజాగా ఆమె కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్ళును ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ ను చేసింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా నటించాడు.ఇవి మంచివి కాదని, డెలివరీ చేసే లోపే పాడైపోతున్నాయని, ప్యాకింగ్ కూడా సరిగ్గా ఉండటం లేదని, డబ్బు కోసం ఇలాంటివి ప్రమోట్ చేయొద్దని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుమ కరోనా టైం నుండి ఆ సంస్థ ప్రొడక్ట్స్ ను తెగ ప్రమోట్ చేస్తూనే ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: