రచయిత విజయేంద్ర ప్రసాద్ వయసు 75 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ ఒక్క క్షణం కూడ విరామం తీసుకోకుండా రకరకాల కథలు వ్రాస్తూనే ఉన్నాడు. సీత వ్యక్తిత్వం పై రామాయణ నేపధ్యంలో కంగనా రనౌత్ ను హీరోయిన్ గా చేసి తీస్తున్న సినిమా వెనుక విజయేంద్ర ప్రసాద్ కలం ఉంది.

 

 

త్వరలో రాజమౌళి మహేష్ తో తీయబోతున్న మూవీకి సంబంధించిన కథా ఆలోచనలు చేస్తూనే విజయేంద్ర ప్రసాద్ ఒక అద్భుతమైన చారిత్రాత్మక నవల వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి. 17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ స్టోరీని 'బ్రహ్మపుత్ర : ది అహోం సన్ రైజెస్' అనే టైటిల్ తో నవలగా విజయేంద్ర ప్రసాద్ వ్రాసిన నవల ఈనెల 30వ తారీఖున అత్యంత భారీ స్థాయిలో ముంబాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నవలను నేవల్ ఆఫీసర్ కుల్ ప్రీత్ యాదవ్ తో కలిసి విజయేంద్ర ప్రసాద్ రచించినట్లు తెలుస్తోంది.

 

 
గతంలో కూడ చారిత్రాత్మక నేపధ్యం ఉన్న అనేక కథలను ఈయన వ్రాసారు. ఒకవైపు రాజ్యసభ సభ్యుడుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొకవైపు సినిమా కథలు వ్రాస్తూ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు నవలలు ముఖ్యంగా చారిత్రాత్మక నవలలు వ్రాయడం ఆయన ఒక హాబీగా పెట్టుకున్నాడు. అందులో భాగంగానే ఈ చారిత్రాత్మక నవల  అహోం రాజ్యాన్ని పాలించిన స్వర్గదేవ్ జయధ్వజ సింఘా కుమార్తె అయిన యువరాణి పద్మిని తో లచిత్ ప్రేమలో పడిన కథ చుట్టూ ఈనవలా కథనం ఉంటుందని తెలుస్తోంది.



 

లచిత్ పద్మిని ప్రేమ గురించిన సంఘటనలు ఆ తర్వాత జరిగే పరిణామాలతో 'బ్రహ్మపుత్ర' నవల ఉంటుందని తెలుస్తోంది. ఈ నవల రాయడంలో కుల్ ప్రీత్ యాదవ్ యొక్క సహకారం చాలా ఉంది అంటూ విజయేంద్ర ప్రసాద్ సన్నిహితుల దగ్గర ఓపెన్ గానే చెపుతున్నాడు. ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో నవలలు చదివే అలవాటు చాల తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులలో విజయేంద్ర  ప్రసాద్ నేటితరం వారి దృష్టిని తన నవల ఆకర్షించగలిగితే అది ఒక చరిత్ర అవుతుంది..  


 

 


మరింత సమాచారం తెలుసుకోండి: