యాంకర్ అనసూయ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా జబర్థస్త్ కామెడీ షోతో ఫుల్ పాపులారిటీని సంపాదించింది ఈ బ్యూటీ. జబర్థస్త్ షోతో అనసూయ కెరీరే మారిపోయింది. టెలివిజన్ షోలలో కూడా హాట్‌గా కనిపించవచ్చని అనసూయ నిరూపించింది. యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది. క్షణం, పుష్ప, రంగస్థలం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ కొత్తగా నటిస్తోన్న 'విమానం' సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన వీడియో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఆ సాంగ్ ఎలా ఉందో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభం.. ఆ షోతో స్టార్‌డం: అనసూయ తొలుత న్యూడ్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. తరువాత కొద్ది రోజులకే బుల్లితెర మీద దర్శనం ఇచ్చింది. జబర్థస్త్ కామెడీ షోకు యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. జబర్థస్త్ షోతో స్టార్ యాంకర్‌గా మారిపోయింది. ఈ షోతో నేమ్ , ఫేమ్ రెండూ ఒకేసారి సంపాందించింది.అప్పటి నుంచి అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మెప్పించింది.

కెరీర్‌ మలుపు తిప్పిన రంగమ్మత్త: అడవి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. కాని రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయలో ఉన్న నటనను బయటకు తీసింది. ఈ సినిమాల్లో రంగమ్మత్తగా అనసూయ నటనకు విమర్శలకుల నుంచి కూడా ప్రశంసలు కూడా అందాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప మొదటి పార్ట్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. పార్ట్ 2లో దర్శకుడు సుకుమార్ ఆమె పాత్రకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ నడుస్తోంది.

వివాదాలతో సహవాసం: నటన, అందంతో అనసూయ ఎంతటి పేరు తెచ్చుకుందో.. వివాదాలతో కూడా అదే రీతిలో విమర్శలను ఎదుర్కొంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా ఆమె మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవడంపై నెటిజన్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అనసూయ వారికి తనదైనశైలిలో కౌంటర్స్ ఇస్తూనే ఉంది . ఇక హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో అనసూయ పెద్ద యుద్దమే చేస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుంచి కూడా విజయ్ దేవరకొండ అభిమానులతో అనసూయ గొడవ పడుతూనే ఉంది. లైగర్ సినిమా ప్లాప్ అయిన సందర్భంలో కర్మ ఎవరినీ వదలదంటూ పోస్ట్ పెట్టింది. అనసూయ పెట్టిన పోస్ట్‌కు విజయ్ దేవరకొండ అభిమానులు రెచ్చిపోయారు. చిల్ ఆంటీ అంటూ ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

బికినీతో హల్ చల్: అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన సినిమా, షోలకు సంబంధించిన విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తోంటుంది. వరుస సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్న ఈ భామ కాస్త సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బికినీ స్విమ్మింగ్‌ పూల్‌లో భర్త, పిల్లలతో కలిసి జలకాలు ఆడేస్తూ చిల్ అవుతోంది. తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

వేశ్య పాత్రలో ఫుల్ ఎక్స్‌పోజింగ్: ఇక అనసూయ కొత్తగా నటిస్తోన్న చిత్రం 'విమానం'. ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. 'సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సాంగ్‌లో అనసూయ బోల్డ్ యాటిట్యూడ్, మేనరిజంతో కనిపించింది. లిరికల్ వీడియోలోనే అనసూయ ఇంతలా రెచ్చిపోయిందంటే.. ఇక సినిమాలో ఎంతలా రెచ్చిపోయి ఉంటుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ కొర్రపాటి - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: