వర్సటైల్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ, తెలుగు సినిమాలకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన నటి. తొలుత హీరోయిన్‌గా వచ్చినప్పటికీ.. తర్వాత పత్ర్యేకమైన పాత్రలో, విలన్‌గా మారిపోయింది వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె తండ్రి కూడా ప్రముఖ నటుడు అన్న సంగతి విదితమే. శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తెనే వరలక్ష్మి.

నాంది సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించిన అమ్మడు.. తర్వాత పక్కా కమర్షియల్‌లో కనిపించింది. ఆ తర్వాత యశోదలో ఆమె నటనకు ఫిదా కాని వారు ఉండరు. తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటనను ఇరగదీసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన తండ్రి సూపర్ స్టార్ అయినా.. నటిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సమయంలో తాను ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చానని తెలిపింది. అయితే నాన్న తనని సినిమాలలోకి నిరాకరించటం వల్ల మంచి అవకాశాలను కోల్పోయానని పేర్కొంది. తాను సినిమా రంగంలోకి రావడానికి వ్యతిరేకిని కాదు కానీ, చదువు పూర్తి చేసిన తర్వాత నటన వైపు రావాలన్నది నాన్న ఆలోచనని వెల్లడించింది.

అందుకే నాకు మంచి సినిమా అవకాశాలు వచ్చినా కూడా ఆయన నిరాకరించడం వల్ల ఎన్నో గొప్ప సినిమా అవకాశాలు కోల్పోయానని తెలిపింది .శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో జెనీలియా పాత్రలో నేనే నటించాల్సి ఉందని కానీ నాన్న ఒప్పుకొని కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానని పేర్కొంది. ఈ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇవ్వడమే కాకుండా స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తి అయిందని, అయితే నాన్న ఒప్పుకోని కారణంగానే ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం హనుమాన్, శబరీ సినిమాల్లో నటిస్తోంది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: