ప్రస్తుతం ఫ్రాన్స్ లో 76వ కాన్స్ చలనచిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇక ఆ వేడుకలో పాల్గొంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఈ సందర్భంగా హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాల సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.. ఇక దీనిపై మీ స్పందన ఏంటి అన్న ప్రశ్నకి స్పందించింది శృతిహాసన్.. ఇక ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారు.. మేమంతా ఇంకా కష్టపడుతున్నాం.. అంతేకాదు సమాన వేతనం అనే అంశంపై కనీసం నా దగ్గర చర్చ కూడా జరగడం లేదు.. 

కానీ ఎప్పటికైనా హీరోలతో హీరోయిన్ లక్కీ కూడా సమానమైన రెమ్యూనరేషన్ లభించే రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. అంతేకాకుండా గతంలో నేను కాన్స్  ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నాను.. ఇక ఈసారి నేను నటించిన  ఇంటర్నేషనల్  ఫిల్మ్ ది ఐ ఫిలిం కోసం ఇందులో  పాల్గొనడం జరుగుతుంది. అంతేకాదు విభిన్నమైన సంస్కృతులు సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కాన్స్ వేడుకల్లో దేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇదిలా ఉంటే ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

స్టార్ కిడ్గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ తన తండ్రి పేరును ఉపయోగించుకోకుండా తన సొంత కృషితో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది. ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శృతిహాసన్ ఏకంగా ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే .నందమూరి నరసింహ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకి జోడిగా నటించింది శృతిహాసన్. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ  వీరసింహరెడ్డి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో సైతం చిరంజీవికి జంటగా నటించిన శృతిహాసన్. ఇక ఈ సినిమా సైతం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. దీంతో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాలతో ఒకేసారి రెండు విజయాలను అందుకున్న శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: