టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందంతో ఎందరినో ఆకట్టుకుంది ఈమె. ఇక ఒక సినిమాతో తెలుగులో వరుస సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది .ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనకు పైగాని సినిమాలు ఉన్నాయి .ప్రస్తుతం ఆ సినిమాలో షూటింగ్లో బిజీగా ఉంది .ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక ప్రస్తుతం వరుస సినిమల షూటింగ్లో బిజీగా ఉన్న ఈమె .ఇదిలావుంటే ఇక తాజాగా టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్ల గురించి  ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది ఈమె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు టికెట్లు కొనుక్కొని వస్తున్నారు అంటే అది కేవలం హీరో లను చూడడానికి మాత్రమే.. హీరోల కోసమే అన్నన్ని డబ్బులు పెట్టి టికెట్లు కొని థియేటర్లకు వస్తారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ లీల తాను ఇండస్ట్రీకి వచ్చి నా కొత్తలో మంచి పాత్రలు ఇస్తే చాలని ..అలా కాకుండా సినిమా మొత్తం తానే కనిపించాలని కోరుకొను అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది ఆమె.

ఇక ప్రస్తుతం శ్రీ లీల హీరోల కోసమే టికెట్లు కొనుక్కొని సినిమా చూడడానికి వస్తారు అంటూ చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి .ఇలా ఉంటే ఇక ఈ వార్త విన్న చాలామంది ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో సక్సెస్ అందుకున్న ఈమె ఇప్పుడు ఇలా వరుస సినిమాలో చేస్తోంది అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: