క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాల డిఫరెంట్ సినిమాలను తీసినప్పటికీ ఇప్పటికీ సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పూర్తిగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు అతడు మొదలుపెట్టిన ఒక కొత్త ప్రయోగం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమంది యంగ్ రైటర్స్ అదేవిద్ధంగా యంగ్ డైరెక్టర్స్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈవిషయంలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కొందరికి అవకాశాలు వస్తూ ఉంటే మరికొందరికి అవకాశాలు రావడం లేదు.


దీనితో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టాలెంటెడ్ వ్యక్తుల కోసం ప్రశాంత్ వర్మ ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేసాడు. ఇండస్ట్రీలోని వివిధ క్రాప్ట్ లకు సంబంధించిన 100 మంది కొత్త వారిని తీసుకుని వారి నుంచి కొత్త ఆలోచనలు స్వీకరిస్తూ వాటిని మరింత మెరుగు పరిచి కొత్త వారికి అవకాశాలు క్రియేట్ చేయాలి అన్నది ప్రశాంత్ వర్మ ఆలోచన.


లేటెస్ట్ గా అతడు దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ మూవీ పై అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈమూవీ ఈపాటికే విడుదల కావలసి ఉంది. అయితే ‘ఆదిపురుష్’ ముందు ఈమూవీ విడుదల ఉండటం మంచిది కాదని ఈమూవీ విడుదల వాయిదా వేసారు అన్న వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం వేరు అని ప్రశాంత్ వర్మ అంటున్నాడు. ఈసినిమాలో 1600 సిజి షాట్ లు ఉంటాయని ఇప్పటికి 800 వరకు మాత్రమే పూర్తి అయ్యాయని అందువల్లనే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది అని అంటున్నాడు.



హనుమంతుడి శక్తి ఒక సగటు వ్యక్తికి వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో ఈమూవీ ఉంటుంది అని అంటున్నాడు. అంతేకాదు ఈసినిమాలో కొన్ని సీన్స్ లో ప్రేక్షకులు కాళ్ళకు వేసుకున్న జోళ్లు తీసేసి చూడాలనేంత ఇంటెన్సిటీ ఉంటుందని ప్రశాంత్ వర్మ అంటున్నాడు. ప్రశాంత్ వర్మ మాటలు నిజమైతే ఈమూవీ ‘ఆదిపురుష్’ తరువాత విడుదలైనప్పటికీ ఘన విజయం సాధించే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: