పేదరికం ఐశ్వర్యం ఈ రెండిటి మధ్య ఎప్పుడు సయోధ్య కుదరదు. ఈ రెండింటికి సంబంధించిన రహదార్లు పరస్పర వ్యతిరేక దిశలోనే ప్రయాణిస్తాయి. అయితే మనం ఐశ్వర్యం కోరుకుంటే పేదరికం వైపు దారితీసే పరిస్థితులను ఖచ్చితంగా తిరస్కరించగల మానసిక స్థితి మనకు ఉండాలి.


అయితే ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ఆర్ధిక విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. ఐశ్వర్యం రకరకాలుగా ఉంటుంది. ఆధ్యాత్మిక మానసిక విద్య విషయాలలో నైపుణ్యం కలిగి ఉండటం కూడ ఐశ్వర్యం గానే పరిగణింప బడుతుంది. వాస్తవానికి ప్రతివ్యక్తి భవిష్యత్ కు ఆవ్యక్తి మాత్రమే కారకుడు. చాలామంది పేదరికాన్ని అంగీకరిస్తూ ఆ పేదరికంతో యుద్ధం చేసే శక్తి లేక రాజీ పడిపోతు జీవితాన్ని కొనసాగిస్తారు.


అలా రాజీపడిపోతు ఒక రోడ్ మ్యాప్ లేకుండా జీవించే వ్యక్తి ఎప్పుడు ధనవంతుడు కాలేడు. సందేహించడం మొదలు పెడితే ప్రతి విషయంలోనూ మనకు సందేహాలే కలుగుతాయి. అందువల్లనే ఐశ్వర్యాన్ని కోరుకునే వ్యక్తి పిరికి వాడుగా ఉండ కూడదు అని అంటారు. మన మానసిక స్థితి మనకు మనంగా నియంత్రించుకోగలిగిన శక్తి ఈ మానశిక స్థితిని బయట వ్యక్తుల దగ్గర నుంచి అప్పుగా తీసుకోలేము అదేవిధంగా కొనుక్కోలేము. కనీసం సృష్టించుకోవడం కూడ జరగదు. అయితే మన ఆలోచనలను బట్టే మన మానశిక స్థితి ఉంటుంది.


అందుకే పేదరికం అనేది ఒక మానశిక స్థితి మాత్రమే అని అంటారు. ఆ స్థితికి లోబడి ఉండే వ్యక్తికి అవకాశాలు అన్నీ ఒకదాని వెంట ఒకటి మనకు తెలియకుండానే దూరం అయిపోతు ఉంటాయి. పేదరికం మన ఆశయాన్ని ద్వంశం చేస్తుంది. మన సంకల్ప బలాన్ని నీరు కారుస్తుంది. అన్నింటా మించి మన మానశిక అనుభూతులను పేదరికం ద్వంసం చేస్తుంది. అందుకే పేదరికానికి భయపడే వ్యక్తి ఏదీ సాధించలేడు. అయితే ఈ భయంకరమైన పేదరికాన్ని జయించడానికి మానసిక పట్టుదలతో పాటు ఆత్మ పరిశీలనా కూడ చాల అవసరం. అందుకే నెపోలియన్ హిల్ తన పుస్తకంలో పేదరికరికంతో పోరాడలేని వ్యక్తి సంపదకు దరిచేరాలేడు అంటూ అభిప్రాయపడుతున్నారు. పేదరికంతో పోరాడి జయాన్ని పొంది ఐశ్వర్యంపొందగలడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: