దేశీయ దిగ్గజం బ్యాంకు గా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు తాజాగా ఒక గుడ్ న్యూస్ ను తెలిపింది. సాధారణంగా తమ కస్టమర్లకు సపోర్టుగా నిలవడం కోసం ఎన్నో రకాల లోన్ ఆఫర్ ను కూడా ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ఎవరైనా సరే షాపింగ్ కోసం డబ్బులు కావాలి అనుకునే వారికి కేవలం కొద్ది క్షణాల్లోనే లోన్ ఇచ్చే ఆఫర్ కూడా ఒకటి ఉంది. అంతేకాదు తమ కస్టమర్లకు ఈ ఆఫర్ ద్వారా సుమారుగా 8 వేల నుంచి లక్ష రూపాయల వరకు తక్షణమే లోను అందిస్తామనిప్రకటించింది ఎస్బిఐ..మీరు ఈ లోన్ తీసుకున్న తర్వాత ఈఎమ్ఐ ఫెసిలిటీ ద్వారా అప్పు తీర్చవచ్చు. ఎస్బిఐ డెబిట్ కార్డు ఉన్నవారు ఈ రుణం పొందడానికి అర్హులు అవుతారు.. క్రెడిట్ కార్డు ఉన్నవారు ఎలాగో క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ ఆప్షను ఎంచుకుంటారు కాబట్టి క్రెడిట్ కార్డు లేని వాళ్ళ కోసం ఎస్బిఐ సరికొత్తగా డెబిట్ కార్డు ఉంటే చాలు ఎటిఎం కార్డు ద్వారా మీరు షాపింగ్ చేయవచ్చు అని చెబుతోంది.. ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినప్పుడు షాపింగ్ చేసి ఈఎంఐ గా మార్చుకోవడం.. వల్ల ఎనిమిది వేల నుంచి లక్ష రూపాయల మధ్య మీరు ఎంతైనా షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది ఎస్బిఐ.

అంతేకాదు pre-approved పద్ధతి ద్వారా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇస్తుంది. అంటే ముందుగానే కస్టమర్లకు లోన్ ఇస్తుందికాబట్టి ఎస్ బి ఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునేవారు ఈ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.కేవలం ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్లైన్లో కూడా షాపింగ్ చేసిన తర్వాత ఎస్బిఐ డెబిట్ కార్డు స్వైప్  చేసి మీరు ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఫ్లాట్ఫామ్ లో కూడా ఈ ఆఫర్ మనకు లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: