
రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా రూ.257 రూపాయల వేతనాన్ని చెల్లిస్తూ ఉండగా దానిని ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి 15 రూపాయలు పెంచి రూ.272 పెంచుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో రోజువారి గరిష్ట వేతనాన్ని 15 రూపాయలు పెంచినట్లుగా తెలియజేశారు ఈ ఉపాధి హామీ పథకం కింద వేతనాలను ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రాలలో వేరువేరుగా కూలీల వేతనాలను నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.. దీంతో వేతనాల రేట్లు నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఆయా రాష్ట్రాలలో వ్యవసాయ రంగాలలోని కూలీలు కొనుగోలు చేస్తూ ఆధారంగా వేతనాలను కేంద్ర గ్రామీణ శాఖ అధికారులను నిర్ణయించింది.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వేతనం రూ.257 రూపాయలు కాగా పెంచిన వేతనంతో రూ.272 రూపాయలు కలవు.. తెలంగాణలో వేతనం రూ.257 రూపాయల కాగా పెంచిన వేతనంతో రూ.272 రూపాయలు కలవు.. అలాగే బీహార్లో రూ.210 ఉండగా పెంచిన వేతనంతో రూ.228 రూపాయలు.. అలాగే గుజరాత్లో రూ.239 రూపాయలు కాక పెంచిన ధరతో రూ.256 కలదు.. కర్ణాటకలో ప్రస్తుతం రూ.309 రూపాయిలు కాగ.. పెంచిన ధరతో రూ .316 .. ఇక కేరళలో రూ.311 ఉండగా పెంచిన ధరతో రూ.333 కలదు అలాగే మధ్యప్రదేశ్లో రూ.204 రూపాయలు.. పెంచిన రూ.221 కలదు.. అలాగే మహారాష్ట్రలో పెంచడంతో రూ.273 కాగా ఒడిస్సాలో రూ .237 రాజస్థాన్లో రూ.255 తమిళనాడులో రూ.294 పశ్చిమ బెంగాల్లో 237 కలదు.