పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఈ సినిమా అధికారిక రీమేక్.. దిల్ రాజు, బోనీ కపూర్ లు ఈ సినిమా కి నిర్మాతలు కాగ కరోనా కారణంగా ఈ వేసవికి రిలీజ్ కావాల్సిన సినిమా రిలీజ్ కాలేదు.. ఇప్పటికే దిల్ రాజు తన సినిమా 'వి' OTT ద్వారా రిలీజ్ చేసి లాభపడగా వకీల్ సాబ్ విషయంలో అలా చేయొద్దని పవన్ తేల్చేశాడు.. రాజకీయాల్లోంచి తిరిగి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు మంచి అంచనాలు పెంచుకున్నారు..