చాలా రోజుల నుండి స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ ల పెళ్లి ఆగిపోవడంపై ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లికి ముందు రోజు పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో అది చూసిన స్మృతి మంధాన తండ్రి సహించలేక ఆర్గ్యూ చేసేసరికి ఆ టెన్షన్లో స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చి హాస్పిటల్ పాలయ్యారని, దానంతటికి కారణం పలాష్ ముచ్చల్ పెట్టుకున్న ఎఫైరే నని పలాష్ ఎఫైర్ కారణంగానే స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది అనే ఉద్దేశంతో స్మృతి పెళ్లి వాయిదా వేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.అంతేకాదు పలాష్ ముచ్చల్ కి ఓ కొరియోగ్రాఫర్ తో ఎఫైర్ ఉందని, పెళ్లికి ముందు రోజు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అవ్వడంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్మృతి మంధాన తండ్రి కి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు వార్తలు వినిపించాయి

అయితే ఇప్పటివరకు వినిపించింది ఎంత నిజమో తెలియదు కానీ హార్ట్ ఎటాక్ తర్వాత మళ్ళీ పెళ్లికి సంబంధించిన కొత్త డేట్ ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ సడన్గా స్మృతి మంధాన తన పెళ్లి రద్దయిందని తెలిపింది. వ్యక్తిగత కారణాలవల్ల తన పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలిపింది. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పడం ఇష్టం లేకపోయినా కూడా ఈ రూమర్లు ఇక్కడితో ఆగిపోవాలి అనే ఉద్దేశంతోనే బయటకు వచ్చి పెళ్లి రద్దయిన విషయాన్ని చెబుతున్నట్టు ప్రకటించింది. మా ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించి ఈ విషయంలో సైలెంట్ గా ఉంటారని భావిస్తున్నాను అంటూ స్మృతి మంధాన పోస్ట్ పెట్టింది.

 అయితే స్మృతి మంధాన పెళ్లి రద్దయిన విషయాన్ని ప్రకటించిన కాసేపటికే పలాష్ ముచ్చల్ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. స్మృతి మంధానతో వ్యక్తిగత సంబంధం నుంచి మూవ్ ఆన్ అవుతున్నా..రూమర్లు నమ్మేవారిని  చూసి తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది.ఎలాంటి సోర్స్ లేని వాటితో జడ్జి చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి.తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.ఈ కష్టకాలంలో మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: