టాలీవుడ్ లో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి భారీ క్రేజ్ అందుకుంది. ఈమధ్య సినిమాలలో తగ్గించినప్పటికీ వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుతంగా రానిస్తోంది. జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలలో కూడా పలు పోటీలలో పాల్గొంటుంది ప్రగతి. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శన చేసినట్టుగా తెలుస్తోంది. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ & మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో 4 పథకాలను సాధించింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. తనకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ ఉదయ్ కు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ప్రగతిని అభినందిస్తున్నారు.


ప్రగతి నిరంతరం జిమ్ వర్కౌట్లు, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేస్తూ ఉంటుంది. అలా 2023లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో ఎన్నో అసాధారణమైన విజయాలను సాధించింది. హైదరాబాదులో జిల్లా స్థాయి పోటీలలో స్వర్ణ పథకాలను సాధించిన ప్రగతి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ లో కూడా బంగారు పథకాన్ని సాధించింది. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని 5వ స్థానంలో నిలిచింది. ఆ వెంటనే బెంగళూరులో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలలో స్వర్ణం కూడా గెలిచింది.

2024 లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్లు రజత పతాకం అందుకుంది. ఈ ఏడాది (2025)ప్రగతి కెరియర్ లోనే చాలా కీలకమని చెప్పవచ్చు. కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్లో గోల్డ్ మెడల్ సాధించింది. తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రగతి అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. ఒకవైపు నటనతో రాణిస్తూనే మరొకవైపు క్రీడలలో తనకున్న పట్టుదలతో జాతీయ ఛాంపియన్ గా నిలవడం గమనార్హం. ఎంతోమంది నటి ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: