భారీ సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు కొద్ది రోజులుగా గడ్డు రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు.. ఆయననుంచి నుంచి తెలుగు లో సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడే రుద్రమదేవి చిత్రం వచ్చినా గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.. ఆమధ్య హిరణ్య కశ్యప అనే సినిమా తో కొంత హడావుడి చేసిన ఆ సినిమా ఆగిపోయినట్లు అనిపిస్తుంది.. ఆ తర్వాత అది మొదలయ్యే లోపు గుణ ఒక వెబ్ సిరీస్ చేయాలనుకున్నాడని.. నెట్ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం కుదిరి దాని మీద వర్క్ చేశాడని.. ఐతే గుణ పనితీరు నచ్చక నెట్ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.