ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి మలయాళ మూవీ ‘జల్లికట్టు’ అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఇండియా నుండి ఆస్కార్ నామినేషన్ కోసం హిందీ, మలయాళం, మరాఠీతో పాటు ఇతర భాషల నుంచి 27 సినిమాలు పరిశీలనకు రాగా వాటిలో నుంచి ‘జల్లికట్టు’ను ఎంపికచేసినట్లు ఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చైర్మన్ రాహుల్ రవైల్ పేర్కొన్నారు.