టాలీవుడ్ హీరో గోపిచంద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు గోపిచంద్‌కు వీరాభిమాని. ఇటీవల అతడికి కరోనా సోకడంతో చికిత్స కోసం భారీగా అప్పులు చేసాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అభిమాని గురించి తెలియగానే గోపిచంద్ వెంటనే రూ.2 లక్షల చెక్ పంపించారట.