ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితకథలు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మరో క్రీడాకారుడి జీవిత కథ తెరపైకి రానుంది. ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నారు.