తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్. విక్రమ్, సూర్య లాంటి వాళ్లే ఇప్పుడు తెలుగులో విజయం కోసం అల్లాడిపోతుంటే.. విజయ్ మాత్రం అదిరింది, సర్కార్, విజిల్ అంటూ వరస విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మాస్టర్ సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.