నితిన్, కీర్తి సురేశ్ జంటగా ‘రంగ్ దే’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా మళ్లీ చిత్ర యూనిట్ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.