2020 సంవత్సరం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏప్రిల్ 29 ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇక ప్రముఖ నటుడు రిషికపూర్ ఏప్రిల్ 30న కన్నుమూశారు.