రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది. కేవలం నైట్ షోలు మాత్రమే పడటంతో రెండో రోజు 6.23 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇక మూడో రోజు కూడా దాదాపు 4 కోట్ల వరకు షేర్ వచ్చేలా కనిపిస్తుంది.