మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో సినిమా చేయాలనీ వంశీ పైడి పల్లి ట్రై చేసిన అది కుదరలేదు. ఇప్పట్లో మహేశ్ బాబు ఖాళీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అందువలన చరణ్ ను లైన్లో పెట్టడానికి వంశీ పైడిపల్లి ట్రై చేస్తున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరై కాంబినేషన్ లో ‘ఎవడు’ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.