తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాటి కాలంలో కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతో కలిసి మల్టీస్టారర్స్ కూడా చేసారు కృష్ణంరాజు. తన సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో సంచలన సినిమాలు చేసారు ఈయన. యంగ్ ఏజ్‌లో ఉన్నపుడు ఈయన ఎంత స్మార్ట్‌గా ఉండేవాళ్ళో అభిమానులు చెప్తుంటారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.