సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున పోరాటాలు విప్పుతున్నారు హీరోయిన్ లు..శ్రిరెడ్డి, తను శ్రీ దత్తా, షెర్లిన్ చోప్రా, చిన్మయి లాంటి వాళ్ళు తమకు జరిగిన అన్యాయాలను బహిరంగంగా చెప్పారు. ఇప్పటితరం నటీమణులనే కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. గతంలో లేని ఇప్పుడు వచ్చిందంటే వారు ఎంతటి బాధను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. గతంలో సొసైటీ గురించి, పరువు, మర్యాదల గురించి ఆలోచించినా ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నారు.. రాబోయే తరానికి లైన్ క్లియర్ చేస్తున్న వీరి చర్యలు హర్షణీయం..