తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈమె నటించిన తొలి మూడు సినిమాలు విజయం సాధించాయి. ప్రేమమ్, అఆ.., శతమానం భవతి లాంటి సూపర్ హిట్స్‌తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అనుపమ.. ఆ తర్వాత మాత్రం అదే జోరు చూపించడంలో విఫలమైంది.