నా పెళ్లికి సంబంధించి నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది. నాకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉంది. అందులో సన్నిహితులు మాత్రమే ఉండాలి. నేను కాంచీవరం చీరను ధరించి, బంగారం పెట్టుకొని, నా తలలో పూలను పెట్టుకోవాలి. నా భర్త లుంగీలో ఉండాలి. ఆ తరువాత మేమిద్దరం అరటాకులో భోజనం చేయాలి అని అన్నారు.ఇక ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు.. తిరుపతిని నేను చాలా సార్లు సందర్శించా. నా జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లిని.. నాకు ఇష్టమైన వాడితో అక్కడే చేసుకోవాలనుకున్నా. గతంలో నేను అక్కడ జరిగిన మా బంధువుల పెళ్లికి వెళ్లా. చాలా ఎంజాయ్ చేశా. ఆడంబరంగా జరిగే పెళ్లిళ్లంటే నాకు ఇష్టం ఉండదు.