తాజా సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ మరొక పాత్రలో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. బ్రిటిష్ వారి కోసం పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపించి కేకపుట్టించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ రామ్ చరణ్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.