దక్షిణాది అందులో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాల తాకిడి ఎక్కువైంది. తెలుగులో రూపొందించిన బాహుబలి, కేజీయఫ్ ఛాప్టర్ 1 ప్రభావమో ఏమో కానీ.. తెలుగు నుంచి ఓ మోస్తరు క్రేజ్ ఉన్న హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మరి. సక్సెస్, ఫెయిల్యూర్‌ను పక్కన పెడితే ఇప్పటికే కొంత మంది టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయగా.. మరికొందరు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.