రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఆచార్య సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. "ధర్మానికి ధైర్యం తోడైతే అనే క్యాప్షన్" తో విడుదలైన ఈ పోస్టర్ లో రామ్ చరణ్ తన తండ్రితో కలిసి ఉన్నారు. తండ్రీకొడుకు ఇద్దరూ కూడా ఒకే కలర్ వస్త్రాలలో టెరిఫిక్ గా కనిపించి మెగా ఫ్యాన్స్ ని బాగా ఖుషి చేస్తున్నారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్, చిరంజీవి తుపాకులు పట్టుకొని అన్న ల్లాగా కనిపించడం అందరిలో ఆసక్తిని రేపుతోంది.