తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు నటుడు అల్లరి నరేష్. స్టార్ హీరోలతో పోటీ పడుతూ.. సక్సెస్ వచ్చినా.. ఫెయిల్యూర్ అయినా.. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు చేసేవాడు. కానీ చాలా వరకు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. దీంతో చాలా రోజుల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ‘నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.