లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదారియా పాటకు చాల క్రెజ్ ఉంది. తాజాగా ఈ పాటకి అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ పాట విడుదలైన కొన్ని రోజులకే.. ఆ పాట నాది అని కోమలి అనగా.. మరో జానపద సింగర్ శిరిష కూడా ఈ పాట నాది అంటూ వివాదానికి తెరతీసారు. ఇక ఆ గొడవపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ.. అది జానపద గేయం. దానిపై అందరికి హక్కు ఉంటుందని చెప్పుకోచ్చాడు.