ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే తమ సినిమాను 50 రోజుల వరకు ఓటిటిలో విడుదల చేసే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ముందు వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి. దిల్ రాజు చెప్పిన మాటలే అబద్ధమయ్యాయి. ఏప్రిల్ 26న సినిమా ఓటిటిలో విడుదల అవుతుందంటూ ముందు నుంచి వార్తలు వచ్చాయి.