ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్నారు. ‘సర్కారు వారి పాట’ పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.