చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన 1971 మే 1న హైదరాబాద్లోని సికింద్రాబాద్లో జన్మించారు. అజిత్ తల్లి కొలకత్తా చెందిన ఆమె కాగా.. ఆయన తండ్రి కేరళకు చెందిన వ్యక్తి. ఇక అజిత్ పదవ తరగతిలోనే చదువు మానేశాడు.